Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యాపై అత్యాచార ఆరోపణలు!

Rape and molestation allegations on Hardik Pandya
  • దావూద్ అనుచరుడిగా రియాజ్ భాటీకి గుర్తింపు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన రియాజ్ భార్య రెహనుమా
  • లైంగికంగా వేధించారని వెల్లడి
  • భర్తే ఇతరులతో శారీరక సంబంధాలకు బలవంతం చేసేవాడని ఆరోపణ 
  • ఫిర్యాదు పత్రంపై అనుమానాలు
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు రియాజ్ భాటి భార్య రెహనుమా సంచలన ఆరోపణలు చేసింది. క్రికెటర్ హార్దిక్ పాండ్యా, ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా, మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్, బులియన్ కింగ్ పృథ్వీరాజ్ కొఠారీలు తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరందరూ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పేర్కొంది. కాగా, రెహనుమా తన పరిస్థితికి భర్త రియాజ్ భాటీనే కారణమని వెల్లడించింది.

వ్యాపార ప్రయోజనాల కోసం భర్తే ఇతరులతో శారీరక సంబంధాలకు బలవంతం చేసేవాడని వివరించింది. ఈ క్రమంలో పలువురు ప్రముఖుల వద్దకు పంపించాడని ఆరోపించింది. అయితే, రెహనుమా ఫిర్యాదు పత్రంలో సరైన చిరునామా పేర్కొనకపోవడంతో అందులో చేసిన ఆరోపణలపై సందేహాలు తలెత్తుతున్నాయి.
Hardik Pandya
Allegations
Rehnuma Bhati
Riyaz Bhati
Mumbai

More Telugu News